lokesh: ప్రత్యేక హోదా పేరుతో కుట్ర రాజకీయాలు జ‌రుగుతున్నాయి.. తిప్పి కొట్టండి: నారా లోకేశ్ పిలుపు


ఎన్టీఆర్‌ స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఈరోజు టీడీపీ యువనేత నారా లోకేశ్ పర్యటించారు. ఆయనతో పాటు నందమూరి బాలకృష్ణ, ఇతర పార్టీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ... బాలకృష్ణ‌ ప్రోత్సాహంతోనే తాను నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నాన‌ని అన్నారు. నిమ్మ‌కూరులో బెల్‌ కంపెనీ ఏర్పాటుతో అభివృద్ధి జ‌రుగుతోంద‌ని అన్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌ మనవడిగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని ఆయ‌న వ్యాఖ్యానించారు.

రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఏపీలో లోటు బ‌డ్జెట్ ఉన్న‌ప్ప‌టికీ ఆ న‌ష్టం కనిపించకుండా రాష్ట్ర సీఎం చంద్రబాబు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని లోకేశ్ అన్నారు. డబ్బుల్లేవని చంద్రబాబు నాయుడు ఏనాడు అభివృద్ధి ఆపలేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆంధ్రప్ర‌దేశ్‌కి ప్రత్యేక హోదా పేరుతో కుట్ర రాజకీయాలు జ‌రుగుతున్నాయ‌ని, వాటిని గ‌మ‌నించి ప్రజలు తిప్పి కొట్టాలని ఆయ‌న అన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌ల్ల‌ వచ్చే లాభాలన్నీ ప్యాకేజీతో వస్తున్నాయని, ఓ వైపు 2017తో ప్రత్యేక హోదా రద్దు చేస్తామని కేంద్ర స‌ర్కారు అంటోంద‌ని, ఇప్ప‌టికే హోదా ఉన్న రాష్ట్రాలు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో చివ‌రిస్థానంలో ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు.

  • Loading...

More Telugu News