పూరి క్షేత్రం ప్రత్యేకతలు

జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన క్షేత్రాల్లో పూరి ఒకటిగా కనిపిస్తుంది. ఆషాఢ మాసంలో ఇక్కడ జరిగే ఉత్సవాన్ని దర్శించడానికి ప్రపంచంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తారు. అలాంటి పూరి క్షేత్రం అనేక విశేషాలకు .. ప్రత్యేకతలకు నిలయంగా కనిపిస్తుంది.

శ్రీకృష్ణుడు .. బలరాముడు .. వారి చెల్లెలు  సుభద్ర .. ఈ ముగ్గురూ వివాహితులు అయినప్పటికీ, ఈ క్షేత్రంలో దంపతులుగా మాత్రం కనిపించరు. సాధారణంగా ఆయా క్షేత్రాల్లో గర్భాలయంలోని మూర్తులను ఒకే రథంలో ఉంచి ఊరేగింపు నిర్వహిస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా శ్రీకృష్ణుడిని .. బలరాముడిని .. సుభద్రను వేరు వేరు రథాలలో ఊరేగిస్తారు. ఇక ఏ క్షేత్రంలోనైనా రథోత్సవం పూర్తయిన తరువాత ఆ సాయంత్రమే రథం తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. కానీ పూరిలో అలా కాదు .. రథం బయల్దేరిన తొమ్మిది రోజుల తరువాత తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. చాలా క్షేత్రాల్లో ఒకసారి రథం తయారు చేస్తే, కొన్నేళ్ల పాటు అదే రథాన్ని వాడతారు. కానీ పూరిలో ఒకసారికి మాత్రమే వాడటం విశేషం.    


More Bhakti News