ప్రయాణానికి శుభ శకునాలు

ఎవరు ఏ శుభకార్యం నిమిత్తం బయలుదేరినా మంచి శకునం చూసుకుని బయల్దేరుతుంటారు. మంచి శకునం చూసుకుని వెళ్లడం వలన, తలపెట్టిన కార్యం ఎలాంటి అటంకం లేకుండా పూర్తవుతుందనే విశ్వాసం ప్రాచీన కాలం నుంచి వుంది. సాధారణంగా ముత్తయిదువులు ఎదురు వచ్చినప్పుడు మంచి శకునంగా భావించి బయలుదేరుతుంటారు. అలాగే నీళ్ల బిందెలతో స్త్రీలు ఎదురైనప్పుడు కూడా మంచి శకునంగానే భావించి అడుగుముందుకు వేస్తారు.

ప్రయాణానికి సిద్ధమైనప్పుడు మగళధ్వనుల వినిపించినా .. గంట ధ్వని వినిపించినా శుభప్రదమేనని శాస్త్రం చెబుతోంది. గుమ్మంలో నుంచి అడుగు బయటికి పెడుతుండగా ఏదైనా శుభవార్త వినిపించినా, పిల్లా పాపాలతో కూడిన దంపతులు ఎదురైనా నిస్సందేహంగా బయలుదేరవచ్చని అంటారు. ఇక అనుకోకుండా ఏనుగు .. గుర్రం .. ఆవులు ఎదురైనా, తలెట్టిన కార్యం శుభప్రదంగా పూర్తవుతుందని చెబుతారు. ఒకవేళ ఏదైనా శకునం చెడుగా అనిపించినా .. చెడు వార్త విన్నా, కాళ్లు కడుక్కుని కాసేపు కూర్చోవాలి. మంచినీళ్లు తాగేసి .. ఇష్టదైవానికి నమస్కరించుకుని తిరిగి బయలుదేరవచ్చని పెద్దలు చెబుతుంటారు.


More Bhakti News