శివరాత్రి రోజున పుష్పార్చన ఫలితం

మాఘమాసంలో వచ్చే బహుళ పక్ష చతుర్దశి పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది .. దీనినే మహాశివరాత్రిగా పరిగణిస్తారు. శివరాత్రి అంటే శుభప్రదమైన రాత్రి అని అర్థం. అలాంటి మహాశివరాత్రి రోజున చేసే శివారాధన పాపాలను పటాపంచలు చేసి, శివ సాయుజ్యాన్ని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున వివిధ రకాల పుష్పాలతో స్వామిని అర్చించడం వలన వివిధ రకాల ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

ఈ రోజున మల్లెపూలతో పూజించడం వలన సకల భోగాలు కలుగుతాయి. జాజిపూలతో అర్చించడం వలన వాహన యోగం కలుగుతుంది. కలువలు .. గన్నేరులతో పూజించడం వలన శత్రునాశనం జరిగి, రాజ్యలాభం చేకూరుతుంది. నువ్వు పూలతో పూజించడం వలన యవ్వనం .. శిరీష పుష్పాలతో అర్చించడం వలన ఆనందం .. ఉమ్మెత్త పూలతో పూజించడం వలన సంతాన భాగ్యం కలుగుతాయి. జిల్లేడు పూలతో పూజించడం వలన శౌర్యపరాక్రమాలు లభిస్తాయి. అవిసె పూలతో అర్చించడం వలన పాపాలు నశిస్తాయి .. తుమ్మి పూలతో పూజించడం వలన మోక్షప్రాప్తి కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News