నారద సరస్సు .. ముక్తికా సరస్సు

భావనారాయణస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో 'సర్పవరం' ఒకటిగా కనిపిస్తుంది. కాకినాడ సమీపంలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. సువిశాలమైన ప్రదేశంలో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఈ ఆలయంలో అనంతుడి కోసం వెలసిన పాతాళ భావనారాయణుడు .. నారద మహర్షి ప్రతిష్ఠించిన రాజ్యలక్ష్మీదేవి సమేత భావనారాయణస్వామి దర్శనమిస్తుంటారు.

ఆలయం గాలి గోపురానికి ఎదురుగా రెండు సరస్సులు కనిపిస్తుంటాయి. వాటికి 'నారద సరస్సు' .. 'ముక్తికా సరస్సు' అని పేరు. నారద మహర్షి స్నానమాచరించి స్త్రీ రూపాన్ని పొందిన సరస్సు 'నారద సరస్సు'గా, ఆ స్త్రీ రూపం నుంచి విముక్తిని పొందిన సరస్సు 'ముక్తికా సరస్సు'గా పిలవబడుతున్నాయి. వ్యాస మహర్షి కాశీ క్షేత్రం నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీనాధుడి కాశీఖండం .. భీమఖండంలోను ఈ క్షేత్ర ప్రస్తావన ఉండటం విశేషం.


More Bhakti News