దధీచి కుండం విశిష్టత

దధీచి మహర్షి మహా శివభక్తుడు. అనుక్షణం ఆయన శివ నామాన్ని జపిస్తూ ఉండేవాడు. అనునిత్యం శివారాధనలో తరిస్తూ ఉండేవాడు. అలాంటి దధీచి మహర్షి రెల్లుపూలతో మహాశివుడిని పూజించేవాడు. దధీచి మహర్షి పూజించిన కారణంగానే తనకి 'రెల్లుపూలు' ప్రీతిపాత్రమైనవని సాక్షాత్తు సదాశివుడు ప్రకటించడం విశేషం. మహాశివభక్తుడైన దధీచి మహర్షి నైమిశారణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు.

లోక కల్యాణం కోసం దధీచి మహర్షి తన శరీరాన్ని వదిలేయడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో 88 వేల నదీ జలాలతో ఆయనకి దేవతలు స్నానం చేయించారు. అలా ఆయనకి స్నానం చేయించిన నీటితో ఏర్పడినదే 'దధీచి కుండం'. ఇప్పటికీ నైమిశారణ్యం వెళ్లినవారు ఈ కుండంలోని నీటిని 'గంగ'తో సమానమైనవిగా భావిస్తుంటారు. దధీచి కుండంలోని నీటిని తలపై చల్లుకున్నా, స్నానం చేసినా 88 వేల నదులలో స్నానమాచరించిన ఫలితం దక్కుతుందని చెబుతారు. సమస్త పాపాలు నశించి పుణ్యరాశి పెరుగుతుందని అంటారు.


More Bhakti News