సంతాన గోపాల స్తోత్ర పఠన ఫలితం

వివాహమైన తరువాత దంపతులు సంతానం గురించిన ఆలోచనే చేస్తారు. సంతానాన్ని పొందాలనీ, 'అమ్మా .. నాన్న' అని పిలిపించుకోవాలని వాళ్లు ఆరాటపడుతుంటారు. ఇక ఈ దంపతుల పుట్టింటివారు .. అత్తింటివారు కూడా వీరి సంతానం కోసం ఎదురుచూస్తుంటారు. మనవడినో .. మనవరాలినో ఎత్తుకుని ఆడించాలని ముచ్చటపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దంపతులకి సంతానం ఆలస్యమైతే ఆందోళన చెందుతారు. ఆ కుటుంబానికి సంబంధించిన పెద్దవాళ్లు కూడా కలవరపాటుకు లోనవుతారు.

ఆ దంపతులకు సంతానాన్ని ప్రసాదించమని పూజలు .. వ్రతాలు చేస్తుంటారు. ఇలా సంతానం కలిగే విషయంలో ఆలస్యం జరుగుతున్నప్పుడు. 'సంతాన గోపాల స్తోత్రం' పఠించాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అనునిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో 'సంతాన గోపాల స్తోత్రం' పఠించడం వలన, ఆ దంపతుల నిరీక్షణ ఫలిస్తుందని అంటారు. అందువలన సంతానం కలిగే విషయంలో ఆలస్యం జరుగుతున్నప్పుడు, సంతాన గోపాలస్వామికి మనసులోనే నమస్కరించుకుని అనునిత్యం 'సంతాన గోపాల స్తోత్రం' చదువుకోవడం మంచిదనేది మహర్షుల మాట.    


More Bhakti News