శివానుగ్రహాన్ని కలిగించే రుద్రాక్ష ధారణ

శివ భక్తులు రుద్రాక్షలను తప్పకుండ ధరిస్తూ వుంటారు. రుద్రాక్షలను ధరించి చేసిన శివాభిషేకం వలన విశేషమైన ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. రుద్రాక్షలలో ఉసిరికాయ పరిమాణంలో వున్నది ఉత్తమమైనదనీ .. రేగుపండు పరిమాణం కలిగినది మధ్యమమనీ .. శెనగ గింజ పరిమాణం కలిగినది అధమమని శాస్త్రం చెబుతోంది. ఒక్కో రుద్రాక్ష వలన ఒక్కో విశేషమైన ఫలితం ఉంటుంది. అందువలన ఆయా ఫలితాలను ఆశించేవారు అందుకు తగిన రుద్రాక్షలను ధరించవలసి ఉంటుంది.

రుద్రాక్షలను ధరించినవారు నియమ నిష్టలను తప్పకుండా పాటించవలసి ఉంటుంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో నియమం పాటించలేకపోతే, ఆవుపాలతో ఆ రుద్రాక్షలకు అభిషేకం చేసి తిరిగి వాటిని ధరించవలసి ఉంటుంది. శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం రోజున .. పౌర్ణమి రోజున .. మహాశివరాత్రి రోజున రుద్రాక్షలు ధరించడం వలన ఆశించిన ఫలితాలు అందుతాయి. ఎవరైతే రుద్రాక్షలను ధరిస్తారో వారిపట్ల శివానుగ్రహం తప్పక వుంటుందనేది మహర్షుల మాట.    


More Bhakti News