కష్టాలను తొలగించే కృష్ణుడు

శ్రీకృష్ణుడి లీలావిశేషాలను గురించి వింటున్నాకొద్దీ వినాలనిపిస్తుంది. ధర్మ సంస్థాపన కోసం ఆయన చూపిన లీలా విశేషాలను ఎంతగా తలచుకున్నా తనివి తీరదు. అలాంటి కృష్ణుడు చాలా ప్రదేశాల్లో కొలువై పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. వేణుగోపాలస్వామిగా ఆయన ఆవిర్భవించిన ఆలయాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని క్షేత్రాల్లో ప్రధాన దైవంగాను .. మరికొన్ని క్షేత్రాల్లో ఉపాలయాల్లోను స్వామివారు దర్శనమిస్తూ ధన్యులను చేస్తుంటాడు.

కృష్ణుడి అనుగ్రహం వుంటే కష్టాలు దరిచేరవని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. జీవితంలో ఎంతటివారికైనా కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ కష్టాల నుంచి బయటపడటానికి ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేస్తూనే వుంటారు. తమ వలన కానప్పుడు భగవంతుడిని ఆశ్రయిస్తుంటారు. ఎలాంటి కష్టాల్లో వున్నా ఆదుకునే దైవంగా శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. ఆ స్వామికి అనునిత్యం పాలు .. మీగడ .. వెన్న నైవేద్యంగా సమర్పించడం వలన ప్రీతి చెందుతాడు. ఆయన అనుగ్రహం వలన కొండంత కష్టం కూడా కొవ్వొత్తిలా కరిగిపోతుంది.  


More Bhakti News