కుష్ఠు వ్యాధిని నివారించిన శివుడు

పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'సోమవరం' ఒకటి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో ఈ గ్రామం వుంది. ఇక్కడి శివుడు 'బృగుమాలికా సోమేశ్వరుడు'గా పిలవబడుతుంటాడు. పూర్వం బృగు మహర్షిచే పూజలందుకున్న ఇక్కడి శివుడు, కాకతీయుల కాలంలో వెలుగులోకి వచ్చాడు. కాకతీయుల కాలంలో వేమారెడ్డి అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థలపురాణం చెబుతోంది.

వేమారెడ్డి కుమారుడు కుష్ఠు వ్యాధితో బాధపడుతూ ఉండేవాడట. ఎన్నో చోట్ల ఎన్నోరకాల వైద్యాలు చేయించినా ప్రయోజనం లేకుండాపోయింది. దాంతో వేమారెడ్డి నిరాశా నిస్పృహలకు లోనయ్యాడు. ఒక రోజున సోమేశ్వరస్వామి .. వేమారెడ్డికి స్వప్నంలో కనిపించి, తనకి ఆలయాన్ని నిర్మిస్తే ఆయన కుమారుడి కుష్ఠువ్యాధిని నివారిస్తానని చెప్పాడట. దాంతో వేమారెడ్డి రంగంలోకి దిగిపోయి ఆలయ నిర్మాణం చేపట్టడం .. అది పూర్తయ్యేసరికి ఆయన కొడుకు కుష్ఠు వ్యాధి తగ్గిపోవడం జరిగిపోయాయట. అంతటి మహిమాన్వితమైన ఇక్కడి శివుడిని గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజిస్తూ .. తరిస్తూ వుంటారు. 


More Bhakti News