శిలా విమానంపై విహరించే వేంకటేశ్వరుడు

తెలంగాణ ప్రాంతంలో వేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాల జాబితాలో 'అమ్మపేట' ఒకటిగా కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పరిథిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడి కొండపై అలమేలు మంగ .. పద్మావతి దేవి సమేతంగా స్వామివారు స్వయంభువుగా ఆవిర్భవించడం విశేషం. ఇక్కడి స్వామివారిని భక్తులు వెలగొండ వేంకటేశ్వరుడుగా పిలుచుకుంటూ వుంటారు.

అరణ్యవాస సమయంలో సీతారాములు ఈ కొండపై కొంతసేపు విశ్రాంతి తీసుకున్నట్టుగా చెబుతుంటారు. ఇక్కడి నుంచి సీతారాములు 'భద్రాచలం' వెళ్లడం జరిగిందని అంటారు. ఈ కొండ ప్రాంతంలో పొడవైన ఒక రాయి కనిపిస్తూ ఉంటుంది. దీనిని 'శిలావిమానం'గా ఇక్కడి వాళ్లు చెబుతుంటారు. అమ్మవార్లతో కలిసి స్వామివారు ఈ శిలా విమానంపై విహరిస్తారని నమ్ముతుంటారు. ఈ శిలా విమానానికి కూడా భక్తులు నమస్కరించుకుంటూ వుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సమస్త పాపాలు పటాపంచలై, సకల శుభాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.   


More Bhakti News