మర్రిచెట్టులో వెలసిన వేంకటేశ్వరుడు

కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఎక్కువగా కొండలపై వెలసి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆర్తితో పిలిచినంతనే ఆదుకుంటూ ఉంటాడు. అలాంటి ఆ స్వామి 'మర్రి చెట్టు'లో వెలసిన క్షేత్రమే 'మల్లాది'గా కనిపిస్తుంది. గుంటూరు జిల్లా అమరావతి క్షేత్రానికి సమీపంలో 'మల్లాది' గ్రామం కనిపిస్తుంది.

పూర్వం ఈ గ్రామస్తులు .. విశేషమైన రోజుల్లో వేంకటేశ్వరస్వామిని పూజించుకోవాలనుకుంటే ఆ పక్కనే వున్న మరో గ్రామానికి వెళ్లవలసి వచ్చేదట. ఆ సమయంలో కృష్ణానదిని దాటడానికి వాళ్లు చాలా ఇబ్బందులు పడేవాళ్లట. దాంతో స్వామివారు ఆ భక్తులను అనుగ్రహించడం కోసం, ఈ గ్రామంలోని మర్రిచెట్టు 'మాను'లో వెలిశారని చెబుతారు. ఒకసారి తుఫాను రావడంతో ఈ మర్రి చెట్టు పూర్తిగా నేలకి ఒరిగిందట. దారికి అడ్డుగా ఉందనే ఉద్దేశంతో కొమ్మలను తీసేశారట. ఆ సమయంలో మర్రి చెట్టుమాను ఓంకార శబ్దం చేస్తూ యథాస్థానంలో నిలిచిందని చెబుతారు. స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా వున్నారని చెబుతూ, భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.             


More Bhakti News