శ్రీవారి ఆభరణాలు

కలియుగ దైవమైన 'శ్రీ వేంకటేశ్వర స్వామి'ని ఏడాది పొడవున వివిధ రకాల ఆభరణాలతో అలంకరిస్తూ వుంటారు. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి, ఆయన మనసు దోచుకోవడానికి పూల హారాలు ... బంగారు హారాలు ... రత్నాల హారాలు పోటీ పడుతుంటాయి. ఆయా కాలాల్లో ఎందరో సంస్థానాధీశులు ... రాజులు ... చక్రవర్తులు స్వామివారిని దర్శించి అమూల్యమైనటు వంటి ఆభరణాలను కానుకలుగా సమర్పించారు. ఆ ఆభరణాలు స్వామివారి వైభవానికి ప్రతీకలుగా దర్శనమిస్తుంటాయి.

గర్భాలయంలో 'బంగారు పద్మ పీఠం'పై బంగారు పాదాలతో కొలువుదీరిన మూలమూర్తి అలంకరణలో ... వజ్ర కిరీటం .. వజ్రపు శంఖు చక్రాలు .. రత్న కిరీటం .. రత్నాల శంఖు చక్రాలు .. ఆకాశ రాజు కిరీటం .. భుజకీర్తులు .. భుజదండ భూషణాలు .. కర్ణ పత్రాలు .. చిన్న కంఠాభరణం .. బంగారపు పులిగోరు హారం .. గోపుహారం .. సువర్ణ యజ్ఞోపవీతం .. తులసీ పత్ర హారం .. అష్టోత్తర శతనామ హారం .. సహస్రనామ హారం .. దశావతార హారం .. శ్రీ వత్సం .. కౌస్తుభం .. సాలగ్రామహారం .. వజ్రపు అశ్వత్థ పత్ర హారం ... చంద్రవంక కంటే .. అయిదు పేటల కంటే ... ఉదర బంధం .. వడ్డాణాలు .. సూర్య కఠారి (ఖడ్గం) రత్నాల కరపత్రాలు .. రత్నాల వైకుంఠ హస్తం .. రత్నాల కటిహస్తం .. రత్నాల మకరకంఠి .. నాగాభరణాలు .. అంకెలు .. వంటి ఆభరణాలతో స్వామివారిని అలంకరిస్తారు. నిండుగా ... నిత్య సుందరంగా కనిపించే స్వామికి ఈ ఆభరాణాలు మరింత శోభను తెచ్చిపెడతాయి ... భక్తుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయి.


More Bhakti News