సర్పలింగం

కష్టాలు ఎదురైనప్పుడు ... కన్నీళ్లు పెట్టుకోవలసి వచ్చినప్పుడు దేవుడనేవాడు ఉన్నాడా ... లేడా? అనే సందేహం తలెత్తుతుంటుంది. అయితే కొన్ని నమ్మలేని నిజాలను కళ్లెదుట ఆవిష్కరిస్తూ ... తాను ఉన్నాననే విషయాన్ని దేవుడు ఎప్పటికప్పుడు తెలియజెపుతూనే ఉంటాడు. అలా తాను ఉన్నానంటూ భక్తవ శంకరుడు వెలసిన మహిమాన్వితమైన క్షేత్రమే ... 'నాగేశ్వర క్షేత్రం'.

ఇది కృష్ణా జిల్లా 'కృత్తి వెన్ను' గ్రామంలో భక్తుల పాలిట కొంగు బంగారమై అలరారుతోంది. ఇక్కడి శివలింగం 'పాము ఆకారం'లో దర్శనమిస్తుంది. శివుడికి ... నాగు పాముకి అవినాభావ సంబంధం వుంది కదా ... ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకోవడం సహజం. అయితే ఈ సంగతి తెలిస్తే ఎవరైనా సరే తప్పక ఆశ్చర్య పోతారు.

విశేషమేమిటంటే ... ప్రతి అమావాస్య ... పౌర్ణమి రోజుల్లో సర్పాకారంలో ఉన్న ఈ శివలింగం నుంచి 'కుబుసం'లా పొలుసులు .. పొలుసులు రాలుతూ వుంటాయి. అప్పుడు లింగాన్ని శుభ్రం చేసి అభిషేకాదులు నిర్వహిస్తుంటారు. స్వామివారు ఇక్కడే ప్రత్యక్షంగా కొలువై ఉన్నారనడానికి ఈ సంఘటననే నిదర్శనంగా చెబుతూ వుంటారు. మహిమాన్వితమైన ఈ విశేషాన్ని చూడటానికి భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తూ వుంటారు.


More Bhakti News