లక్ష్మీ పంచమి ప్రత్యేకత

02-04-2014 Wed 20:39

ఆర్ధికపరమైన బలం ఆనందాన్నిస్తుంది ... అవసరాలు తీర్చుకోగలం, ఆపదల నుంచి గట్టెక్కగలం అనే ధైర్యాన్నిస్తుంది. ఈ కారణంగానే అందరూ కూడా సంపదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంపదలను పెంచుకోవడానికి ఎంతగానో కష్టపడుతుంటారు. అయితే ఈ విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి చల్లనిచూపు సోకితే సిరిసంపదలతో తులతూగడానికి ఎంతో సమయం పట్టదు.

అలాంటి లక్ష్మీదేవిని 'చైత్రశుద్ధ పంచమి' రోజున పూజించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజామందిరాన్ని వివిధ రకాల పూలమాలికలతో అలంకరించాలి. లక్ష్మీదేవి ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం జరపాలి. దమనములతో అమ్మవారిని అర్చిస్తూ, ఆమెకి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

ఈ విధమైన నియమనిష్ఠలతో పూజించడం వలన దారిద్ర్యం నశించి సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇదే రోజున నాగదేవతను కూడా ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నాగప్రతిమకు పూజాభిషేకాలు నిర్వహించి పాలను నైవేద్యంగా సమర్పించాలి.

సాధారణంగా కొందరిని నాగదోషాలు వెంటాడుతూ ఉంటాయి. ఫలితంగా ప్రతి విషయంలోనూ ఎన్నో ఉబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకు కారణం నాగదోషం అనే విషయం కూడా చాలామందికి తెలియదు. నానారకాల సమస్యలతో సతమతమైపోతున్న వాళ్లు ఈ రోజున నాగదేవతను పూజించడం వలన నాగదోషాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.


More Bhakti Articles
Telugu News
Brahmos successfully test fired
పరిధి పెంచినా గురితప్పని బ్రహ్మోస్... మరో పరీక్షలోనూ సక్సెస్
13 minutes ago
Pope Francis makes sensationa comments on China
చైనాపై మండిపడ్డి పోప్ ఫ్రాన్సిస్
20 minutes ago
Congress party releases manifesto for GHMC elections
గ్రేటర్ ఎన్నికల కోసం మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్
33 minutes ago
What relation we have with Jinnah asks Owaisi
మాకు, జిన్నాకు ఏం సంబంధం ఉంది?: అసదుద్దీన్ ఒవైసీ
35 minutes ago
AP Government amends property tax
ఏపీలో ఆస్తి పన్ను చట్టానికి సవరణ.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
1 hour ago
Requested Union Health Minister to release funds says Buggana
కరోనా ఎమర్జెన్సీ ఫండ్ నుంచి రూ. 981 కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరాం: బుగ్గన
1 hour ago
Sajjala Ramakrishana Reddy comments on Polvaram issue
పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు: సజ్జల
1 hour ago
Somu Veerraju comments on AP Police
పోలీసులు, అధికారులపై సోము వీర్రాజు తీవ్ర విమర్శలు
1 hour ago
India blacks another bunch of apps
చైనాపై డిజిటల్ స్ట్రయిక్స్... మరో 43 యాప్ లను బ్లాక్ చేసిన కేంద్రం
1 hour ago
TRS is comedians party says D Arvind
ఎప్పుడూ సచివాలయానికి వెళ్లని కేసీఆర్ దేశానికి దిశ, దశ చూపుతారా?: ధర్మపురి అరవింద్
1 hour ago