ఇక్కడ రావణుడిని పూజిస్తారు
సీతారాములను ఆరాధ్య దైవాలుగా భావించేవాళ్లంతా .. రావణుడిని ఒక అసురుడుగానే చూస్తారు. దసరా రోజున 'రావణ దహనం' పేరుతో ఆయన బొమ్మను తయారుచేసి .. ధ్వంసం చేస్తుంటారు. అయితే కొన్ని ప్రాంతాల్లో రావణుడిని పూజిస్తుంటారు కూడా. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో రావణుడికి ఒక మందిరం వుంది. అక్కడి వాళ్లంతా దసరా రోజున ఆయనను పూజిస్తారు. ఆ రోజున ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి, ఆలయం తలుపులు మూసి వేస్తారు. మళ్లీ దసరాకి మాత్రమే ఈ ఆలయం తలుపులు తెరవడం విశేషం.
ఇక మధ్యప్రదేశ్ లోని 'విదిశా' ప్రాంతంలో రావణుడి పేరున ఒక గ్రామం వుంది. ఈ గ్రామంలో రావణుడికి ఒక ఆలయం వుంది. ఈ ఆలయంలో రావణుడు శయనిస్తున్నట్టుగా పడుకుని ఉంటాడు. ఆయన విగ్రహం 10 అడుగుల పొడవు ఉండటం ఆశ్చర్యం. ఇక్కడ రావణుడికి అనునిత్యం పూజలు చేస్తారు .. ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తారు. ఇక్కడి వాళ్లంతా రావణుడిని 'రావణ బాబా' అని పిలుస్తూ .. తమ కష్ట నష్టాలు చెప్పుకుంటూ వుంటారు.