అనుగ్రహించడమే అమ్మవారికి తెలుసు

జగజ్జనని అయిన అమ్మవారు వివిధ రూపాలతో .. వివిధ నామాలతో పూజలు అందుకుంటూ ఉంటుంది. అలాంటి అమ్మవారిని ఒక్కోరోజున అభిషేకించడం వలన ఒక్కో నైవేద్యాన్ని సమర్పించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆవు పాలతో అమ్మవారికి అభిషేకం చేయడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయి. ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వలన సంపదలు చేకూరతాయి. ఆవునెయ్యితో అభిషేకం చేయడం వలన అనారోగ్యం దరిచేరదు. 

తేనెతో అమ్మవారిని అభిషేకించడం వలన కీర్తి పెరుగుతుంది. పసుపు నీళ్లతో అమ్మవారిని అభిషేకించడం వలన సౌభాగ్యం నిలుస్తుంది. ఇక అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యంగా 'పాయసం' చెప్పబడుతోంది. 'పాయసం' నైవేద్యంగా సమర్పించడం వలన, అమ్మవారు ప్రీతిచెందుతుంది. తన భక్తుల అవసరాలను గ్రహించి వారి మనసులోని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరేలా అనుగ్రహిస్తుంది. ఆపదలను తొలగిస్తూ ఆయురారోగ్యాలను .. సంతాన సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. అందువలన అనునిత్యం అమ్మవారిని పూజిస్తూ .. సేవిస్తూ .. తరిస్తూ ఉండాలి.   


More Bhakti News