సంక్రాంతి రోజున ఇవి దానం చేయాలి

సూర్యభగవానుడు ప్రతి మాసంలోను ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రవేశించడాన్నే సంక్రమణం అంటారు. అలా సూర్యుడు ధనుస్సు రాశిలో నుంచి మకరరాశిలోకి ప్రవేశించడాన్నే 'మకర సంక్రమణం' అంటారు. ఈ రోజున సూర్యభగవానుడిని పూజించాలి .. అంకితభావంతో ఆరాధించాలి. ఈ రోజున బెల్లము .. గుమ్మడి పండు .. పెరుగును దానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

 బెల్లము ..  గుమ్మడి పండు దానం చేయడం వలన సమస్త దోషాలు నశిస్తాయని అంటారు. అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయని చెబుతారు. ఇక పెరుగును దానం చేయడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయని అంటారు. ఈ రోజున యశోదా దేవి కూడా పెరుగును దానం చేసినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తోంది. కనుక సంక్రాంతి రోజున వీటిని దానం చేయడం మరిచిపోకూడదు.  


More Bhakti News