హనుమంతుడు ఇలా కూడా ప్రీతి చెందుతాడు

హనుమంతుడు ఎంతటి పరాక్రమవంతుడో .. అంతటి సున్నితమైన మనసున్నవాడు. తన స్వామి శ్రీరామచంద్రుడిని ఆరాధించడంలో క్షణమైనా ఆలస్యం చేయని హనుమంతుడు, తన భక్తులను కాపాడటంలోను అంతే త్వరగా స్పందిస్తాడు. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా హనుమంతుడిని పూజిస్తూ వుంటారు .. అంకితభావంతో అర్చిస్తూ వుంటారు.

ప్రదక్షిణలు చేయడం వలన .. ఆకు పూజ చేయడం వలన .. అప్పాలను నైవేద్యంగా సమర్పించడం వలన హనుమంతుడు ప్రీతి చెందుతాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే 'సుందరకాండ' పారాయణం చేయడం వలన, 'రామాయణం' చదవడం వలన కూడా హనుమంతుడు ప్రీతి చెందుతాడని అంటున్నాయి. అలా హనుమంతుడు ప్రీతి చెందడం వలన ఆయన అనుగ్రహం లభిస్తుంది. హనుమ అనుగ్రహం వలన .. గ్రహపీడలు తొలగిపోతాయి. వ్యాధులు .. బాధలు .. భయాలు దూరమవుతాయి. తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి.


More Bhakti News