భీమశంకరుడు అలా ఆవిర్భవించాడట

పరమశివుడు ఆవిర్భవించిన పరమ పవిత్రమైన పుణ్య క్షేత్రాలలో జ్యోతిర్లింగాలకు ఎంతో విశిష్టత వుంది. ఒక్కో జ్యోతిర్లింగం ఆవిర్భావం వెనుక ఒక్కో ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. అలాంటి జ్యోతిర్లింగాలలో 'శ్రీ భీమశంకరం' ఒకటిగా భక్తులకు దర్శనమిస్తోంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రం పూనా సమీపంలో ..  సహ్యాద్రి పర్వతంపై విలసిల్లుతోంది. త్రిపురాసుర సంహారం తరువాత సదాశివుడు ఈ ప్రదేశంలో సేదదీరాడని స్థలపురాణం చెబుతోంది.

అప్పటికే ఎంతో కాలం నుంచి అక్కడ భీమకుడు అనే శివ భక్తుడైన రాజు .. స్వామి గురించి కఠోర తపస్సు చేస్తున్నాడట. ఆ భక్తుడికి ప్రత్యక్ష దర్శనం ఇచ్చిన స్వామి, ఆయన కోరిక మేరకు అక్కడే ఆవిర్భవించాడని అంటారు. భీమకుడు అనే భక్తుడి కోరిక మేరకు శంకరుడు ఇక్కడ  కొలువుదీరిన కారణంగా, ఈ క్షేత్రానికి 'భీమశంకరం' అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఇక్కడ సదా శివుడిని పూజించాడని అంటారు. అలాంటి ఈ జ్యోతిర్లింగ దర్శనం వలన, సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. 


More Bhakti News