హనుమాన్ చాలీసా పారాయణ ఫలితం
ఎవరైనా సరే ఆరోగ్యంగా వున్నప్పుడే తమ పనులను తాము సక్రమంగా చేసుకోగలుగుతారు. ఆరోగ్యంగా వున్నప్పుడే జీవితం సంతోషకరంగా .. సంతృప్తికరంగా కొనసాగుతుంది. అందువలన అంతా కూడా అనారోగ్యాల బారిన పడకుండా చూడమని దైవాన్ని ప్రార్ధిస్తూ వుంటారు. అలాగే ఎవరైనా సరే ఎక్కువగా సంతోషించేది .. తల పెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకం లేకుండగా జరిగినప్పుడే. అనుకున్న పనులు చకచకా పూర్తవుతుంటేనే ఆనందంగా ఉండగలుగుతారు.
విజయం సాధించడం వలన కలిగే ఆనందానుభూతులు వేరు. అందువలన ఏదైనా కార్యాన్ని ఆరంభిస్తున్నప్పుడు ఆటంకం లేకుండా చూడమని భగవంతుడిని కోరుతుంటారు. హనుమంతుడి ఆరాధన వలన కార్యసిద్ధి కలుగుతుందనీ, అనారోగ్యాలు దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ప్రతి మంగళవారం .. శనివారాల్లో దేవాలయంలో గానీ, పూజా మందిరం దగ్గర గాని కూర్చుని 'హనుమాన్ చాలీసా'ను 11 మార్లు పారాయణ చేయవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలతో ఈ విధంగా చేయడం వలన, హనుమ అనుగ్రహంతో మనసులోని కోరికలు నెరవేరతాయి.