సూర్య భగవానుడికి జిల్లేడు పువ్వులంటే ప్రీతి

సూర్యభగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఆరాధించడమనేది ప్రాచీనకాలం నుంచి వుంది. సమస్త జీవరాశులకు చైతన్యాన్ని ప్రసాదిస్తూ .. ఆహారాన్ని అందించేది సూర్యభగవానుడే. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు .. ఆయుష్షును పెంచేవాడు ఆయనే అనే విషయం కూడా ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తుంది. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు .. అందుకే స్నానం చేయగానే సూర్యభగవానుడికి నమస్కరించడమనేది ప్రాచీన కాలం నుంచి వుంది.

 ఈ విధంగా సూర్య భగవానుడిని ధ్యానించడంలోను ఆరోగ్యపరమైన కారణం దాగి వుంది. సూర్య భగవానుడికి ప్రీతికరమైనవిగా 'జిల్లేడు పూలు' చెప్పబడ్డాయి. అందువలన జిల్లేడు పూలతో సూర్యభగవానుడిని అర్చించ వలసి ఉంటుంది. ఈ విధంగా చేయడం వలన అనారోగ్యాలు దూరమై .. ఆరోగ్యంగా ఉండటం జరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. 'ఆరోగ్యమే మహా భాగ్యం' .. ఆరోగ్యంగా ఉంటే అన్నీ ఉన్నట్టేనని అంటూ వుంటారు. అలాంటి ఆరోగ్యం కోసం సూర్యభగవానుడిని జిల్లేడు పూలతో పూజించడం మరిచిపోకూడదు.       


More Bhakti News