ఈ రోజున హనుమకు అప్పాలను నివేదించాలి

హనుమంతుడు మహా పరాక్రమవంతుడు .. ఎంతటి పరాక్రమవంతుడో .. అంతటి బుద్ధిశాలి. ఏ సమయంలో పరాక్రమాన్ని ప్రదర్శించాలో ..  ఎప్పుడు బుద్ధిని ఉపయోగించాలో తెలిసినవాడు. అంకితభావంతో భక్తులు ఆరాధించాలేగానీ .. వాళ్ల వెన్నంటి ఉంటూ కాపాడేవాడు. ఎక్కడ రామ నామ స్మరణ జరుగుతున్నా .. ఎక్కడ హనుమ ఆరాధన జరుగుతున్నా ఆక్కడికి ఆయన తప్పకుండా వస్తాడు .. తన కరుణా కటాక్ష వీక్షణాలు కురిపిస్తాడు.

 అలాంటి హనుమంతుడిని మంగళ .. శనివారాల్లో పూజించడం వలన, గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. హనుమంతుడిని పూజించవలసిన విశేషమైన రోజులలో ఒకటిగా 'మార్గశిర శుద్ధ ద్వాదశి' చెప్పబడుతోంది. ముందురోజున ఉపవాస దీక్షను చేపట్టి .. హనుమను షోడశ ఉపచారాలతో పూజించవలసి ఉంటుంది.  పూజలో సువాసన భరితమైన పూలను ఉపయోగించాలి. ఆ స్వామికి ఎంతో ఇష్టమైన గోధుమ పిండితో చేసిన అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా ఈ రోజున హనుమంతుడిని సేవించడం వలన ఆయన ప్రీతి చెందుతాడు. హనుమ అనుగ్రహం వలన ఆయురారోగ్యాలు లభిస్తాయి .. తలపెట్టిన కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అందువలన మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున హనుమను పూజించడం మరిచిపోకూడదు.       


More Bhakti News