ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవి పూజ

సముద్రంలో కెరటాలు వస్తుండటం ఎంత సహజంగా జరుగుతుంటుందో .. జీవితంలో సమస్యలు ఎదురుకావడం అంతే సహజంగా జరుగుతూ ఉంటుంది. ఏ సమస్య అయినా చీకాకు పెడుతూనే ఉంటుంది .. మనశ్శాంతి లేకుండా చేస్తుంటుంది. ముఖ్యంగా ఆర్ధిక పరమైన సమస్య మరింత ఇబ్బంది పెడుతుంటుంది. చాలా సమస్యలు డబ్బు వలన గట్టెక్కుతూ ఉంటాయి. ఆ డబ్బు కొరతగా వుంటే పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ఇబ్బందులు దూరమవ్వాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి.

లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే, ఆ తల్లికి ప్రీతికరమైన రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. అలా అమ్మవారికి ఇష్టమైన రోజుగా 'ధన త్రయోదశి' చెప్పబడుతోంది. 'ధన త్రయోదశి'గా చెప్పబడే కార్తీక బహుళ త్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఎరుపు రంగు తామర పూలతో పూజించవలసి ఉంటుంది. దీపం లక్ష్మీదేవి స్వరూపం గనుక, ఆ రోజున సాయంత్రం దీపాన్ని వెలిగించి పూజించాలి. వాకిలిలో అన్నం రాశిగా పోసి .. దానిపై ఆ దీపాన్ని ఉంచాలి. ధన ధాన్యాలకు లోటు రాకుండా తమ కుటుంబాన్ని కాపాడుతూ ఉండమని దీపానికి నమస్కరించుకోవాలి. ఈ విధంగా చేయడం వలన మంచి ఫలితం కనిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.     


More Bhakti News