పుణ్యఫలాలను ఇచ్చే కార్తీకం

కార్తీక బహుళ పాడ్యమి రోజున శివాలయానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకుని, 'శాక దానం' ఇవ్వాలి. కార్తీక బహుళ విదియ రోజున శివుడికి అభిషేకం చేయించి బ్రాహ్మణుడికి 'స్వయం పాకం' ఇవ్వాలి. కార్తీక బహుళ తదియ రోజున వైష్ణవ ఆలయానికి వెళ్లి లక్ష్మీనారాయణులను దర్శించుకోవాలి. స్వామివారికి తులసి పూజ చేయించి .. 'అన్నదానం' చేయాలి. కార్తీక బహుళ చవితి రోజున వినాయకుడిని 'గరిక'తో పూజించి 'ఉండ్రాళ్లు' దానంగా ఇవ్వాలి.

 కార్తీక బహుళ పంచమి రోజున పరమ శివుడికి రుద్రాభిషేకం చేయించాలి .. ఈ రోజున 'గోవు'ను దానంగా ఇవ్వాలి. కార్తీక బహుళ షష్ఠి రోజున  శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి 'స్కంద పురాణం' గ్రంధంను దానంగా ఇవ్వాలి. ఇక కార్తీక బహుళ సప్తమి రోజున శివుడికి అభిషేకం చేయించి, 'గోధుమలు' దానంగా ఇవ్వాలి. ఇక కార్తీక బహుళ అష్టమి రోజున 'కాలభైరవాష్టకం' పఠించాలి. గారెలు దండగా గుచ్చి కుక్క మేడలో వేయాలి. ఈ విధంగా చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.          


More Bhakti News