క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి పూజ

కార్తీక శుద్ధ ద్వాదశికే 'క్షీరాబ్ది ద్వాదశి' అని పేరు. పూర్వం దేవతలు .. దానవులు అమృతం కోసం ఈ ద్వాదశి రోజునే క్షీరసాగరాన్ని చిలకడం మొదలుపెట్టారట. అందువల్లనే ఈ రోజుని 'క్షీరాబ్ది ద్వాదశి' అని .. చిలుకు ద్వాదశి .. మథన ద్వాదశి అని పేర్కొంటూ వుంటారు. లక్ష్మీనారాయణులు ఈ రోజున 'బృందావనం'(తులసి కోట)లోకి ప్రవేశిస్తారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఈ రోజున చేసే తులసి పూజ విశేషమైన ఫలితాలను ఇస్తుందని అంటున్నాయి.

ఈ రోజున స్త్రీలు తెల్లవారు జామునే తలస్నానం చేయాలి. సాయంత్రం తులసి పూజ చేసేవరకూ ఉపవాస దీక్షను చేపట్టాలి. తులసి కోట చుట్టూ దీపాలు వెలిగించి .. ఆ తరువాత దీపదానం చేయాలి. తులసి కోటలో తులసితో పాటు ఉసిరిక కొమ్మను ఉంచి పూజించడం మరింత విశేషమని అంటారు. ఈ రోజున చాలామంది 'క్షీరాబ్ది వ్రతం' కూడా చేస్తారు. ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించడం వలన .. తులసిని .. ఉసిరిక కొమ్మను కలిపి పూజించడం వలన .. ఆయురారోగ్యాలు .. సిరిసంపదలు చేకూరడమే కాకుండా, అకాల మృత్యువు దరిచేదని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.  


More Bhakti News