నరకచతుర్దశి రోజున దీపారాధన .. దీపదానం

ఆశ్వయుజ బహుళ చతుర్దశికి 'నరక చతుర్దశి' అని పేరు. ఇది యముడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతోంది. ఈ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి .. నీటిలో గంగా ఆవేశించి ఉంటారని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఉదయాన్నే నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

స్నానానికి ముందు ఆ నీటిలో ఉత్తరేణి .. తుమ్మి .. తగిరస చెట్ల కొమ్మలతో కలియబెట్టి .. ఆ తరువాత స్నానం చేయాలి. స్నానం చేశాక దక్షిణాభిముఖంగా నిలబడి .. నువ్వులతో మూడు సార్లు యముడికి తర్పణం వదల వలసి ఉంటుంది. ఈ రోజున సాయంత్రం ఇంటి ముంగిట్లోనూ .. ఆలయాలలోను దీపాలు వెలిగించాలి. అలాగే దేవాలయాలలో దీపదానాలు చేయాలి. ఈ విధంగా చేయడం వలన యమ బాధలు దరిచేరవనీ .. సమస్త దోషాలు .. పాపాలు నశిస్తాయనేది శాస్త్రవచనం.    


More Bhakti News