శరన్నవరాత్రులలో అమ్మవారి రూపాలు - నైవేద్యాలు

ఆది పరాశక్తి అయిన అమ్మవారు లోక కళ్యాణం కోసం శరన్నవ రాత్రులలో నవవిధ రూపాలను ధరించిందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఒక్కో రూపాన్ని ధరించిన అమ్మవారు ఒక్కో రాక్షసుడిని సంహరిస్తూ వచ్చింది. ఈ కారణంగా ఆ తల్లిచేత రక్షించబడిన బిడ్డలంతా ఈ రోజుల్లో ఆయా రూపాలలో అమ్మవారిని అలంకరించి పూజిస్తూ తరించడం జరుగుతూ ఉంటుంది.

అలా ఆశ్వయుజ పాడ్యమి రోజున 'స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి'ని పూజించి వడపప్పు - పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. విదియ రోజున 'బాలాత్రిపుర సుందరి'ని పూజించి పరమాన్నం నైవేద్యంగా పెడతారు. తదియ రోజున 'లలితా త్రిపురసుందరి'ని ఆరాధించి పులిహోర - కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. చవితి రోజున 'గాయత్రీ దేవి'ని ఆరాధించి అల్లపు గారెలు పెరుగు వడలు నైవేద్యంగా ఇస్తారు. పంచమి రోజున 'అన్నపూర్ణాదేవి'ని పూజించి దధ్యోజనం - కట్టు పొంగలిని నైవేద్యంగా పెడతారు. షష్ఠి రోజున 'సరస్వతీదేవి'ని ఆరాధించి పాయసం - అటుకులు .. బెల్లం నైవేద్యంగా పెడతారు. సప్తమి రోజున లక్ష్మీదేవిని పూజించి చక్రపొంగలి - బూరెలు నైవేద్యంగా ఇస్తారు. అష్టమి రోజున 'దుర్గాదేవి'ని పూజించి 'కదంబం' నైవేద్యంగా పెడతారు. నవమి రోజున 'మహిషాసుర మర్ధిని'ని ఆరాధించి పులిహోర - గారెలు నైవేద్యంగా ఇస్తారు. దశమి రోజున 'రాజరాజేశ్వరి'ని పూజించి చలిమిడి .. గారెలు .. వడపప్పు .. పానకం నైవేద్యంగా సమర్పిస్తారు.    


More Bhakti News