లక్ష్మీదేవి ఇలా ప్రీతి చెందుతుంది
జీవితంలో దారిద్య్రం చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. దారిద్య్రం భయాన్ని .. నిరాశ నిస్పృహలను కలగజేస్తుంది. అనేక రకాల అవమానాలను ఎదురయ్యేలా చేయడమే కాకుండా, అందరి నుంచి దూరం చేస్తుంది కూడా. అలాంటి దారిద్ర్య బాధ ఎలాంటి పరిస్థితుల్లోను కలగకూడదనే అంతా కోరుకుంటూ వుంటారు. అందుకోసం ఎంత కష్టమైనా పడుతుంటారు. దారిద్య్రం తొలగిపోయి .. సిరిసంపదలతో కూడిన ఆనందకరమైన జీవితం లభించాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం వుండాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఆ తల్లికి ఇష్టమైన ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ఉండాలి. తోటివారి పట్ల .. సమస్త జీవుల పట్ల దయను కలిగి ఉండాలి. ఇంటిని .. పూజా మందిరాన్ని పరిశుభ్రంగా .. పవిత్రంగా ఉంచాలి. లక్ష్మీదేవిని అనునిత్యం పూజిస్తూ .. ప్రతి శుక్రవారం పాలతో అభిషేకించి గులాబీలతో పూజించాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన అమ్మవారు ప్రీతి చెందుతుంది.