కాళికాదేవి అవతరించడం వెనుక కథ!

జగన్మాత అయిన పార్వతీదేవి .. లోక కల్యాణం కోసం అనేక రూపాలను ధరించింది. తన బిడ్డలైన ప్రజలు అమ్మా అని పిలిస్తే ఎంత ఆర్తితో వచ్చి ఆదరిస్తుందో, అలాంటి బిడ్డలకి ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు అంతే ఆవేశంతో ఆ తల్లి పరిగెత్తుకు వచ్చి కాపాడుతుంది. అలా తన బిడ్డలను రక్షించుకునేందుకే పార్వతీదేవి .. కాళికాదేవిలా అవతరించింది.

 ఒకసారి రక్తబీజుడనే రాక్షసుడు దేవలోకంపై దండెత్తుతాడు. అతన్ని అడ్డగించడానికి కార్తికేయుడు పోరాడుతూ ఉంటాడు. అయితే రక్షబీజుడి శరీరం నుంచి రాలిన రక్తపు బొట్లు నేలను తాకగానే అతని రూపంగా మారిపోతూ ఉంటాయి .. అది అతను పొందిన వరం. అలా అసురుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, కార్తికేయుడు తన తల్లిని తలచుకుంటాడు. అంతే పార్వతీదేవి .. అసురులు సైతం భయపడే కాళికాదేవి రూపాన్ని ధరించి యుద్ధరంగానికి చేరుకుంటుంది. రక్తబీజుడి శరీరం నుంచి రాలిన రక్తపు బొట్లు నేలపై పడకుండా అక్కడి నేలంతా నాలుక పరుస్తుంది. ఫలితంగా ఒంటరివాడైన రక్తబీజుడు .. కార్తికేయుడి చేతిలో సంహరించబడతాడు.     


More Bhakti News