భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి

భగవంతుడే సర్వానికి యజమాని. ప్రకృతి ద్వారా సమస్త జీవరాశికి అవసరమైన ఆహారాన్ని ఆయనే సమకూర్చుతాడు. భగవంతుడి అనుగ్రహం వల్లనే వర్షాలు కురుస్తాయి. వర్షాల వల్లనే పంటలు పండుతాయి .. ధాన్యం చేతికి వస్తుంది. మిగతా జీవరాశికి కూడా వర్షాల వల్ల ఏర్పడిన నీతోనే దాహం తీరుతుంది. ఆ నీటి వలన పెరిగిన వృక్షాల నుంచే పశువులకు .. పక్షులకు అవసరమైన ఆహారం లభిస్తుంది.

ఇలా భగవంతుడు అందించిన ఆహారం ధాన్యం రూపంలో వున్నా .. ఫలాల రూపంలో వున్నా వాటిని ఆయనకి సమర్పించకుండా తినకూడదు. భగవంతుడికి ముందుగా నైవేద్యంగా సమర్పించి .. తనకి ఆహారాన్ని సమకూర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసి .. అప్పుడు ఆ ఆహారాన్ని స్వీకరించాలి. లేదంటే శివార్పణం అని గానీ .. కృష్ణార్పణం అని గాని అనుకుంటూ తీసుకోవాలి. భక్తితో భగవంతుడికి అర్పించి స్వీకరించడం వలన, ఆహారం కోసం ఇబ్బందిపడే పరిస్థితులు ఎప్పటికీ రావని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti News