భగవన్నామంలోని విశిష్టత అలాంటిది!

సాధారణంగా చాలామంది అత్యవసరాలలో .. ఆపద సమయాలలో భగవంతుడిని తలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. మరికొంత మంది దేవాలయాలకి వెళ్లినప్పుడు .. అక్కడి మంటపంలో కూర్చుని భగవంతుడి నామాన్ని తలుచుకోవడం చేస్తుంటారు. ఇక కాస్త సమయం దొరికితే చాలు ..  ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ ఉండేవారు కూడా లేకపోలేదు. నిరంతరం దేవుడి నామాన్ని పలుకుతూ తమ దైనందిన పనులను పూర్తిచేసే వారు కూడా వున్నారు.

అనుక్షణం తనని తలచుకుంటూ ఉండేవారిని భగవంతుడు ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ వుంటాడనీ .. అలాంటివారికి విశేషమైన ఫలాలను ఇస్తాడనే విషయం ఎంతో మంది భక్తుల విషయంలో నిజమైంది. నిందా పూర్వకంగానైనా శ్రీకృష్ణుడి నామాన్ని శిశుపాలుడు అనేక మార్లు పలికాడు. శ్రీకృష్ణుడిని శత్రువుగా భావించిన శిశుపాలుడు అనుక్షణం ఆయనని నిందిస్తూ, చివరికి ఆయన చేతిలోనే సంహరింపబడ్డాడు. నిందా పూర్వకంగానైనా ఎప్పుడూ శ్రీకృష్ణుడినే తలచుకున్నాడు గనుక, శిశుపాలుడి కోసం స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి. దీనిని బట్టి భగవంతుడి నామంలోని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు.   


More Bhakti News