తల్లిదండ్రులను అపార్థం చేసుకోకూడదు

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఎంతగానో ప్రేమిస్తుంటారు. పిల్లల మనసులోని కోరికలను నెరవేర్చడానికి ఎంత కష్టమైనా పడుతుంటారు. వాళ్ల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతుంటారు. అలాంటి తల్లిదండ్రులను ఒక్కోసారి పిల్లలు అపార్థం చేసుకుంటూ వుంటారు. తాము అనుకున్న పనికి అడ్డు చెప్పడమో .. అడిగినది ఇప్పుడు ఇవ్వడం కుదరదని చెప్పడమో అందుకు కారణమవుతూ ఉంటుంది.

 నిజానికి పిల్లల బాగుకోరే తల్లిదండ్రులు కొన్ని విషయాల్లో అభ్యంతరాలు తెలియజేస్తుంటారు. అది అర్థం చేసుకోలేని పిల్లలు .. తమపై తల్లిదండ్రులకి ప్రేమలేదని అనుకుంటూ వుంటారు. తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు. మేఘం నీటి బిందువులనే వర్షిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వడగళ్లను కూడా కురిపిస్తూ ఉంటుంది. అయితే ఆ వడగళ్లు కొంతసేపటికే నీరుగా కరిగిపోతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలపట్ల చూపించే ప్రేమ కూడా అలాంటిదే. తల్లిదండ్రుల కోపానికి గల కారణాన్ని.. ఆ కోపం వెనుక గల ప్రేమను అర్థం చేసుకుంటే వాళ్లు ఎంత గొప్పవాళ్లనే విషయం స్పష్టమవుతుంది.         


More Bhakti News