ధర్మమే రక్షిస్తుంది .. ఉన్నత స్థితికి చేరుస్తుంది

జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోను ధర్మం తప్పకూడదు. ధర్మాన్ని రక్షిస్తే .. అది మనలను రక్షిస్తుంది. అందుకే ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. ధర్మమంటే ధరించునదని అర్థం. పంచభూతాలతో కూడిన ఈ శరీరం దేనివలన నిలుస్తుందో అదే ధర్మమనేది మహర్షుల మాట. ధర్మాన్ని ఆచరిస్తూ .. ధర్మ మార్గాన్ని అనుసరిస్తూనే జీవితాన్ని కొనసాగించాలి.

 ధర్మబద్ధంగా సంపాదించినది మాత్రమే నిలుస్తుంది. అధర్మంగా సంపాదించినది ఏదైనా అది ఏదో ఒక సమయంలో చేజారిపోతూనే ఉంటుంది. ధర్మమార్గంలో కొనసాగుతున్నవారికి దైవానుగ్రహం ఉంటుంది. ధర్మాన్ని కాపాడుతున్న వాళ్లను దైవం ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది. ధర్మాన్ని వదిలిపెట్టని వారిపైనే భగవంతుడి దృష్టి ఉంటుంది. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మమార్గం నుంచి తప్పుకుని బయటికి రావొద్దని ధర్మరాజుతో కృష్ణుడు చెప్పాడు. ఆయన సూచన మేరకు పాండవులు ధర్మమార్గాన్ని అనుసరించారు కనుకనే, విజయం వాళ్ల సొంతమైంది.    


More Bhakti News