అందరినీ ప్రేమతో ఆదుకునే భగవంతుడు

సాధారణంగా ఎవరైనా తమకంటే గొప్పవారినే సాయం అడుగుతుండటం జరుగుతూ ఉంటుంది. సహజంగా అలాంటివారు తమకి సంబంధించిన వివిధ పనులతో తీరిక లేకుండా వుంటారు. అందువలన అలాంటివాళ్లను కలుసుకోవడమే కష్టమవుతూ ఉంటుంది. సమస్యల్లో వున్న వాళ్లు .. ఆ పై వాళ్లను కలుసుకోవడమే పెద్ద సమస్యగా మారుతుంది. ఎలా వాళ్లను కలుసుకుని సమస్యను చెప్పుకోవాలి? ఎలా వారి నుంచి సాయాన్ని పొంది ఈ చింతను తీర్చుకోవాలి? అనే ఆలోచన మనసును తొలిచేస్తూ ఉంటుంది. ఒక వేళ సాయం చేసే సమర్ధత అవతల వాళ్లకి ఉన్నప్పటికీ, ఆ సంగతి వాళ్లకి గుర్తుండకపోవచ్చు. మరోమారు వాళ్లను కలుసుకునే పరిస్థితి సాయం కోసం ఎదురుచూసే వాళ్లకి లేకపోవచ్చు.

 కానీ భగవంతుడి సాయాన్ని కోరేవారు ఇలా ఎదురు చూడవలసిన అవసరం లేదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. తాను ఎక్కడ వున్నా .. ఎంతటి తీరిక లేకున్నా తన సాయం కోరినవారిని ఆయన ఓ కంట కనిపెట్టుకునే ఉంటాడు. సమయానికి ఆ సాయాన్ని వారికి అందిస్తూనే ఉంటాడు. అవసరాల నుంచి .. ఆపదల నుంచి గట్టెక్కిస్తూనే ఉంటాడు. ఎలాంటి తారతమ్యాలు చూపకుండా అందరికీ అందుబాటులో ఉండేవాడే భగవంతుడు. అలాంటి భగవంతుడి సేవలో తరించేవారికి ఎలాంటి భయాలు .. బాధలు వుండవనేది మహర్షుల మాట.     


More Bhakti News