నిస్వార్థమే దైవానికి దగ్గర చేస్తుంది
దైవ దర్శనం ఎవరు చేసుకున్నా .. తమ గురించో .. తమ కుటుంబ సభ్యుల గురించో కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక దైవం ప్రత్యక్షమై ఏం కావాలని అడిగినా కూడా, తమకి సంబంధించిన కోరికలనే బయటపెట్టే తత్వాన్ని కొందరు కలిగివుంటారు. కానీ నిస్వార్థ పరులు .. త్యాగమూర్తులు మాత్రం తమ గురించి కాకుండా, లోకంలోని అందరి కోసం కోరుకుంటారనడానికి కొన్ని నిదర్శనాలు కనిపిస్తుంటాయి.
ఒకసారి రాజైన రంతిదేవుడు .. ఇంద్రుడి కోసం కఠోర తపస్సు చేశాడట. ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన దేవేంద్రుడు ఏం కావాలని అడిగాడు. తనకంటూ ఏదీ అవసరం లేదని రంతిదేవుడు చెప్పాడు. తన రాజ్యంలోనే కాదు .. మరెక్కడా ఆకలిదప్పులతో ప్రజలు అలమటించకుండా చేయమని కోరాడు. ఎలాంటి అనారోగ్యాలతో ప్రజలు బాధపడకుండా చూడమని అడిగాడు. ప్రజలకు అండగా నిలిచే శక్తి సామర్థ్యాలను ప్రసాదించమని ప్రార్ధించాడు. ఆయన త్యాగనిరతికి మెచ్చిన దేవేంద్రుడు అలాగేనంటూ వాటిని అనుగ్రహించాడు. త్యాగమూర్తులు విశ్వమానవ కళ్యాణం కోసమే దైవాన్ని ప్రార్ధిస్తారని రంతిదేవుడు నిరూపించాడు.