ఆదిత్య హృదయం చదివితే చాలు
జీవితంలో ప్రతి విషయంలోనూ అభివృద్ధిని సాధించడానికి ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంటారు. విజయం సాధించాలనే పట్టుదలతో శక్తి మేరకు పోరాడుతుంటారు. అంతగా కష్టపడితేనే విజయం చేకూరుతుంది. విజయమే ఆనందాన్ని ఇస్తుంది .. ఐశ్వర్యాన్ని ఇస్తుంది .. నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుంది. అందువలన అంతా తాము తలపెట్టిన కార్యంలో విజయాన్ని సాధించడానికి కృషి చేస్తుంటారు.
ధర్మబద్ధంగా తమవంతు ప్రయత్నాలు చేస్తూ విజయాన్ని ఆశించేవారు, 'ఆదిత్య హృదయం' చదవాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆదిత్య హృదయం చదవడం వలన, విజయం తప్పక లభిస్తుంది. యుద్ధ రంగంలోకి అడుగు పెట్టిన తరువాత రావణాసురుడిని సంహరించడం అంత తేలికైన పని కాదనే విషయం రాముడికి అర్థమైపోతుంది. అప్పుడాయన అగస్త్య మహర్షి సూచన మేరకు ఆదిత్య హృదయం మహా మంత్రాన్ని పఠిస్తాడు. దాంతో రావణుడు సంహరింపబడి రాముడికి విజయం సొంతమైంది.