అందుకే దేవుని కడప అంటారు

కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుడు ఎక్కడ ఉంటే అక్కడ వైభవం ఉంటుంది. ఆ స్వామి కొలువైన క్షేత్రాలు అనునిత్యం భక్తుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. అలా ఆ స్వామి కొలువుదీరిన అతి ప్రాచీనమైన క్షేత్రాల్లో 'దేవుని కడప' ఒకటి. వేంకటేశ్వరస్వామి కోరిక మేరకి ఆ స్వామి మూర్తిని కృపాచార్యుల వారు ఇక్కడ ప్రతిష్ఠించారట. స్వామివారు అమ్మవారి సమేతంగా అనుగ్రహిస్తూ లక్ష్మీ వేంకటేశ్వరుడుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.

 శ్రీకృష్ణదేవరాయల వారు ఈ స్వామివారిని అనేక మార్లు దర్శించుకుని, ఎన్నో కానుకలు భక్తితో సమర్పించుకున్నట్టుగా ఇక్కడ ఆధారాలు వున్నాయి. పూర్వం ఇక్కడి లక్ష్మీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్న తరువాతనే , తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి వెళ్లేవారట. అలా ఈ క్షేత్రం తిరుమలకి తొలి గడపగా ఉండేదట. అందువల్లనే ఈ ఊరుకు 'దేవుని గడప' అనే పేరు వచ్చిందట. అదే కాలక్రమంలో 'కడప' గా మారిందని స్థలపురాణం చెబుతోంది.   


More Bhakti News