నిరాశను దగ్గరికి రానీయకూడదు

మనిషి ఆశాజీవి అన్నారు పెద్దలు .. నిజమే ఆశతోనే మనిషి తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.
ఏ పని ప్రారంభిస్తున్నా .. అది పూర్తవుతుందన్న ఆశ ఉండాల్సిందే. కష్టాల సుడిగుండాలు ఎదురవుతున్నా, వాటిని దాటుకుని ఆవల తీరానికి చేరుకుంటామనే ఆశ ఉండాల్సిందే. లేదంటే నిరాశ వెతుక్కుంటూ వచ్చి నిలువునా కమ్మేస్తుంది .. నిర్వీర్యుణ్ణి చేస్తుంది. నిరాశ దేనినీ జయించనీయదు .. మరి దేనిని సాధించనీయదు.

 చుట్టూ చీకటి వున్నా దీపం వెలిగించుకుందామనే ఆలోచన రానీయదు. అందువల్లనే నిరాశను నిర్మొహమాటంగా వదిలేయాలి. ఓటమి తరువాత గెలుపు ..  చీకటి తరువాత వెలుగు ఉంటాయి. అలాగే  కష్టాల తరువాత సుఖాలు ఉంటాయి. ఆ విశ్వాసంతోనే .. ఆ ఆశతోనే అడుగు ముందుకు వేయాలి. తుపాను ధాటికి కూలిపోయిన చెట్టు .. ఏదో ఒక చోట నుంచి చిగురిస్తుంటుంది. అలాగే జీవితంలోని కన్నీటి మబ్బులు తొలగిపోయి ఆనందం ఆవిష్కృతమవుతుంది. అంతవరకూ కావలసింది సహనమే .. ఆశావాద దృక్పథమే.


More Bhakti News