దేవతా చిత్రపటాలపై అపోహలు వద్దు

పూజా మందిరం అంటేనే దేవుడికి మనం కల్పించిన నివాస స్థానం. ఆ పూజా మందిరంలో ఇష్టదేవతల చిత్ర పటాలను వుంచి .. నిత్య దీప .. నైవేద్యాలతో ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంటికి వచ్చిన వారిలో ఎవరైనా ఫలానా దేవతా చిత్రపటం ఉండకూడదని చెప్పగానే వాళ్లు ఆందోళన చెందుతారు. వెంటనే దగ్గరలోని దేవాలయంలో ఆ దేవతా చిత్ర పటాన్ని ఇచ్చేసి వచ్చేస్తుంటారు. నిజానికి చిత్ర పటాలు పెట్టుకునేది భక్తులకి మనసు .. దృష్టి కుదరడానికే. ఏ దేవతా చిత్రపటం కూడా చెడు చేయదు. అందువలన వాటి విషయంలో ఆందోళనలు .. అపోహలు అవసరం లేదనేది ఆధ్యాత్మిక గురువుల మాట.

 భక్తి శ్రద్ధలను .. పవిత్రతను పాటించవలసి ఉంటుందని మాత్రం వాళ్లు సెలవిస్తున్నారు. ఇక శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవ చిత్రపటం ఇంట్లో .. ద్వార బంధంపై ఉంచడం మంచిది. ఈ చిత్రం పటం క్రిందుగా అటూ ఇటూ తిరుగుతూ ఉండటం వలన అనేక శుభాలు కలుగుతాయి. ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ .. ఐకమత్యమనే సూత్రాన్ని పాటిస్తూ శ్రీరాముడు సాధించిన విజయానికి పట్టాభిషేక ఘట్టం నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తూ ఉంటుంది. ఈ చిత్ర పటాన్ని ఎప్పుడూ చూసినా ఈ విషయం గుర్తుకు వస్తుండటం జరుగుతూ ఉంటుంది.     


More Bhakti News