దోషాలను తొలగించే హనుమ ఆరాధన!

హనుమంతుడు ఎంతటి శక్తిమంతుడో .. అంతటి బుద్ధిశాలి. ఎంతటి పరాక్రమవంతుడో అంతటి కరుణా సముద్రుడు. తన శక్తి సామర్థ్యాలను భగవంతుడి సేవ కోసం ఉపయోగిస్తూ .. భక్తులను రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటాడు. రామ నామాన్ని భక్తితో స్మరించినా .. ఆర్తితో హనుమా అని పిలిచినా కదిలి రాకుండా ఆయన క్షణకాలమైనా ఉండలేడు. అందుకే అత్యధిక సంఖ్యలో భక్తులు హనుమంతుడిని పూజిస్తుంటారు. అంకితభావంతో ఆ స్వామికి అభిషేకాలు .. ఆకు పూజలు చేయిస్తుంటారు.

హనుమంతుడికి  సమస్త దేవతల ఆశీర్వద బలం వుంది. అందువలన ఒక్క హనుమంతుడిని పూజించడం వలన, సమస్త దేవతలను ఆరాధించినట్టు అవుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. హనుమంతుడి ఆరాధన వలన బుద్ధి .. మనోబలం .. ఆరోగ్యం చేకూరతాయి. అంతేకాదు .. అభివృద్ధికి ఆటంకంగా నిలిచే కుజ .. రాహు .. శని దోషాలు తొలగిపోతాయి. అందువలన హనుమంతుడిని సదా పూజిస్తూ .. సేవిస్తూ ఉండాలి.  


More Bhakti News