అంతా అమ్మవారి అనుగ్రహమే!

లక్ష్మీదేవి పవిత్రమైన .. పరిశుభ్రమైన ప్రదేశాలయందు ఉండటానికి ఇష్టపడుతుంది. ఏ ఇంట ప్రేమానురాగాలు .. అతిథి మర్యాదలు వుంటాయో అక్కడ స్థిర నివాసం చేయడానికి ఆ తల్లి ఆసక్తిని చూపుతుంది. ఆ ప్రదేశంలోకి అహంభావమనేది ప్రవేశించినప్పుడు అక్కడి నుంచి ఆమె వెళ్లిపోతుంది.

ఇక సరస్వతీ దేవి కూడా అంతే. ఏ వ్యక్తిలో తాను వుంటే బాగుంటుందా అని అమ్మవారు ఆలోచన చేస్తుంది. వినయ విధేయతలు కలిగినవారిలో ఉండటానికి ఆసక్తిని చూపుతుంది. అలా ఆ వ్యక్తులను విద్యావంతులను చేసి .. వాళ్లు ధనవంతులు .. కీర్తివంతులు కావడానికి కారణమవుతుంది. అలాంటివారు అమ్మవారి పట్ల ఆరాధన భావంతో వున్నా .. ఆ తల్లికి ఇష్టమైన మార్గంలో నడచుకున్నా అక్కడే వుండిపోతుంది. అందుకు విరుద్ధంగా నడుచుకున్న వాళ్లు ఆ తల్లి అనుగ్రహానికి దూరమవుతారు .. పతనావస్థకి చేరుకుంటారు.    


More Bhakti News