భగవంతుడి లీల అలాంటిది!

కారణమేదైనా కొంతమంది దైవాన్ని నమ్మరు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కూడా వాళ్లు దూరంగానే ఉంటుంటారు. ఒకే ఇంట్లోను దైవాన్ని నమ్మే వాళ్లు .. నమ్మని వాళ్లు వుండటం మనం చూస్తుంటాం. అలాంటి వాళ్లు కుటుంబసభ్యులు జరుపుకునే పూజా కార్యక్రమాలకి అడ్డు చెప్పరు గానీ, తాము మాత్రం దూరంగా ఉంటుంటారు. అలా దూరంగా వుండేవాళ్లని తన చెంతకి చేర్చుకోవడంలోనే భగవంతుడు అనేక లీలలను ప్రదర్శిస్తుంటాడు.

ముందుగా నాస్తికులుగా ఉంటూ .. ఆ తరువాత ఎదురైన కొన్ని అనుభవాల కారణంగా భక్తులై భగవంతుడి చుట్టూనే తిరిగిన వాళ్లు ఎంతోమంది వున్నారు. కండబలం .. గుండె ధైర్యం వుంటే సాధించలేనిది లేదనుకునే వాళ్లు ఎంతోమంది ఆ తరువాత ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించారు. అలాంటి భక్తులలో మంజునాథుడు .. కన్నప్ప కనిపిస్తారు. ఎంతటి శక్తి సామర్థ్యాలు వున్నప్పటికీ .. అనుకూలమైన ఫలితం రావడం మాత్రం దైవానుగ్రహంపైనే ఆధారపడి ఉంటుందనేది ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతోన్న మాట.        


More Bhakti News