అహంభావం అనర్థాలకు దారితీస్తుంది

తనంతటివాడు లేడు .. తాను తలచుకుంటే జరగనిది లేదు .. జరుగుతున్నది ఏదైనా అందుకు తన గొప్పతనమే కారణమని కొంతమంది అనుకుంటూ వుంటారు. అలా మిడిసిపడినవారికి భగవంతుడు గుణపాఠం చెప్పిన కథలు పురాణాల్లో అనేకం కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో కార్త వీర్యార్జునుడి కథ కూడా మనకి కనిపిస్తుంది. శ్రీమన్నారాయణుడి చేతిలోని సుదర్శన చక్రం .. స్వామివారు సాధిస్తోన్న విజయాలకు తానే కారణమని గర్విస్తుంది. విజయాలు సాధించేది తానైతే .. కీర్తి ప్రతిష్ఠలు శ్రీమన్నారాయణుడికి వెళుతున్నాయని అసూయ చెందుతుంది.

అది గమనించిన శ్రీమన్నారాయణుడు .. భూలోకాన 'సొట్ట' చేతులతో జన్మించమని శపిస్తాడు. దాంతో సుదర్శనుడు తన తప్పును మన్నించమని కోరతాడు. అహంభావం అనర్థాలకు దారితీస్తుందని చెప్పిన స్వామి .. తాను దత్తాత్రేయుడుగా అవతరించి అతని శాపాన్ని ఉపసంహరిస్తానని చెబుతాడు. అలా 'సొట్ట' చేతులతో జన్మించిన కార్త వీర్యార్జునుడు .. దత్తాత్రేయుడి అనుగ్రహంతో ఆ శాపం నుంచి విముక్తుడు అవుతాడు. అహంభావానికి ఆమడ దూరంలో ఉండాలనే నీతిని ఈ కథ చాటుతూ వుంటుంది. 


More Bhakti News