ఈ దేవతలకి ఈ ఫలాలంటే ఇష్టమట!
జీవితంలో తమను నడిపించేవాడు .. అవసరమైనవి అందించువాడు భగవంతుడని చాలామంది నమ్ముతుంటారు. అందువల్లనే ఉదయాన్నే పూజా మందిరాన్ని శుభ్రం చేసి .. వివిధ రకాల పూలచే అలంకరించి .. ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ వుంటారు. భక్తి శ్రద్ధలతో దైవానికి నైవేద్యాలను సమర్పిస్తుంటారు. దైవాలకి ఇష్టమైన పిండి పదార్థాల విషయాన్ని అటుంచితే .. వారికి ప్రీతికరమైన ఫలాలను సమర్పించడం వలన కూడా అనుగ్రహం దక్కుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
శ్రీరాముడికి .. శ్రీ కృష్ణుడికి కమలా పండ్లు అంటే ఇష్టమట. నరసింహస్వామికి యాపిల్ పండ్లు .. దత్తాత్రేయ స్వామికి .. సుబ్రహ్మణ్య స్వామికి అరటిపండ్లు, ఆంజనేయస్వామికి .. దుర్గాదేవికి దానిమ్మ పండ్లు చాలా ప్రీతికరమైనవట. ఇక వినాయకుడికి వెలగపండ్లు .. లక్ష్మీదేవికి జామపండ్లు చాలా ఇష్టమైనవి. వీలైతే ప్రతిరోజు .. లేదంటే పర్వదినాల్లో దేవతలకి ఇష్టమైన ఫలాలను నైవేద్యంగా సమర్పించడం వలన, విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.