గంటను మోగిస్తే దుష్టశక్తులు దూరం!
దేవాలయాలు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాయి. దైవం మనకి తోడుగా ఉందనే ఒక ధైర్యాన్ని కలిగిస్తాయి. అందువల్లనే ఎవరి వీలును బట్టి వాళ్లు దేవాలయాలకి వెళుతుంటారు. దైవ దర్శనం చేసుకుని మనసులోని మాటను చెప్పుకుంటూ వుంటారు. అలా దేవాలయాలకి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా 'గంట'ను మోగిస్తుంటారు. దర్శనార్థం వచ్చాను స్వామి అనే విషయం దైవానికి తెలియజేయడం కోసం గంటను కొట్టడం జరుగుతూ ఉంటుంది.
గంట మోగిన చోట దుష్ట శక్తులు ఉండలేవు. ఆ శబ్దం వినిపించేంత దూరంలో అవి ఉండలేవు. అందువల్లనే గంటను మోగించడం జరుగుతూ ఉంటుంది. గంటను మోగిస్తే హడలెత్తి పారిపోయే దుష్ట శక్తులు .. బిందెలను మోగిస్తే పరిగెత్తుకు వస్తాయనేది పెద్దల మాట. కొంతమంది సరదాకి బిందెలను .. పళ్లాలను చేత్తోగానీ .. గరిటెలతో గాని మోగిస్తుంటారు. అది దుష్టశక్తులు ఆహ్వానం పలకడం వంటిదని పెద్దల విశ్వాసం. అందువలన అలా చేసే వారిని పెద్దలు వెంటనే వారిస్తూ వుంటారు.