సూర్యభగవానుడి ద్వాదశ నామాలు
సూర్యభగవానుడు సమస్త ప్రాణకోటికి జీవనాధారం. అందువల్లనే సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావించి ఆరాధించడమనేది ప్రాచీన కాలం నుంచి వుంది. సూర్యుడు పన్నెండు నామాలను కలిగి ఉంటాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సూర్య .. రవి .. మిత్ర .. భాను .. ఆదిత్య .. మరీచి .. భాస్కర .. ఆర్క .. ఖగ .. పూషా .. హిరణ్యగర్భ .. సవితృ అనే పన్నెండు నామాలతో పిలవబడుతూ ఉంటాడు.
అలాగే సూర్యభగవానుడు ఏడాదిలోని 12 మాసాలలో .. ఒక్కో మాసంలో ఒక్కో పేరుతో కొలవబడుతూ ఉంటాడు. మాఘ మాసంలో వరుణుడు .. ఫాల్గుణ మాసంలో పూషా .. చైత్రంలో ఈశ్వరుడు .. వైశాఖలో ధాత .. జ్యేష్ట లో ఇంద్ర .. ఆషాఢంలో సవితా .. శ్రావణంలో వివస్వాన్ .. భాద్రపదంలో భగుడు .. ఆశ్వయుజంలో పర్వాసుడు .. కార్తీకంలో త్వష్టా .. మార్గశిరంలో భాస్కర .. పుష్యంలో విష్ణు అనే నామరూపాలతో స్వామి ఈ జగత్తును పోషిస్తుంటాడు. అలాంటి సూర్య భగవానుడిని ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో, అలాంటి వాళ్లకి ఆ స్వామి ఆయురారోగ్యాలను .. సిరి సంపదలను అనుగ్రహిస్తాడని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.