నవగ్రహాలకి ప్రదక్షిణ

సాధారణంగా ఆలయాలలో నవగ్రహ మంటపాలు కనిపిస్తూ ఉంటాయి. గ్రహ దోషాల నుంచి బయటపడాలనుకునే వారు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. గ్రహాల అనుగ్రహాన్ని కోరుకుంటూ వుంటారు. నవగ్రహాలకి ప్రదక్షిణలు చేయాలనుకునే వారు .. తప్పకుండా 9 ప్రదక్షిణలు చేయవలసి ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

 నవగ్రహాలకి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు "ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః"  అనే శ్లోకాన్ని పఠించవలసి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. నవగ్రహాలకి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు వాటిని తాక కూడదనే నియమాన్ని తప్పకుండా పాటించాలని చెబుతున్నాయి.  


More Bhakti News