శ్రీరంగం దర్శనమే మహా భాగ్యం

శ్రీమహా విష్ణువు స్వయంగా వెలసిన 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో 'శ్రీరంగం' ప్రధానమైనది. తమిళనాడు - తిరుచురాపల్లికి సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. 156 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ఆలయం .. ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. 7 ప్రాకారాలతో .. 15 గోపురాలతో ఈ ఆలయం అలనాటి వైభవానికి అద్దం పడుతూ ఉంటుంది.

 గర్భాలయంలో స్వామివారు ఐదు తలల ఆదిశేషుడిపై శయనిస్తూ దర్శనమిస్తూ ఉంటాడు. మూలమూర్తిని 'పెరియ పెరుమాళ్' .. అనీ ఉత్సవ మూర్తులను 'నంబెరుమాళ్' అని పిలుస్తుంటారు. శ్రీరంగం క్షేత్రాన్ని దర్శించడం వలన .. వైష్ణవ సంబంధమైన అన్ని క్షేత్రాలను దర్శించిన ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శ్రీరంగనాథుడికి మకర .. కుంభ .. మీన .. మేష మాసాల్లో వరుసగా నాలుగు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను దర్శించడం వలన సమస్త పాపాలు నశించి .. సకల శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.       


More Bhakti News