దైవానికి ప్రీతి కలిగించే పూలు
ఉదయాన్నే ప్రతి ఒక్కరూ పూజ గదిని శుభ్రం చేసి .. పూజ చేస్తుంటారు. ఎవరి అభిరుచికి తగినట్టుగా వాళ్లు పూజా మందిరాన్ని అలంకరించి .. ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్లు భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. పూజ అంటే పూలతో చేసేదే అన్నట్టుగా పూలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తమ పెరటిలో పూసిన పూలతో పూజించే వాళ్లు కొందరైతే .. ఆ అవకాశం లేని వాళ్లు కొనుగోలు చేసిన పూలతో పూజలు చేస్తుంటారు.
తెలుపు .. పసుపు .. ఎరుపు రంగు గల పూలు శ్రేష్టమైనవని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. భగవంతుడికి సమర్పించే పూలు తాజాగా కోసినవై ఉండాలి. వాసనలేని పూలు .. వాడిపోయిన పూలు .. ముళ్లతో కూడిన పూలను పూజకు ఉపయోగించకూడదు. ఇక ఆయా దేవతలకి ఇష్టమైన పూలను గురించిన వివరాలు కూడా ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తాయి. అది తెలుకుని ఆయా దేవతలకి ఆ పూలను సమర్పించడం వలన వాళ్లు ప్రీతి చెందుతారు .. సకల శుభాలను అనుగ్రహిస్తారు.